Header Banner

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో..! ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ!

  Sat Apr 12, 2025 12:21        Environment

భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం.. దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా మేఘాలు పోగయ్యాయి. అవి తెలుగు రాష్ట్రాలవైపు జోరుగా వస్తున్నాయి. అలాగే.. ఆగ్నేయ ఆసియా నుంచి కూడా మేఘాలు వస్తున్నాయి. ఈ కారణంగా... దక్షిణ రాష్ట్రాలతోపాటూ.. వాటిలోనే భాగమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. విశాఖలో మాత్రం భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. మరింత వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 12 (శనివారం)న వాతావరణం పాక్షికంగా మేఘాలతో నిండి ఉంటుంది, విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరప్రాంత జిల్లాలైన విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయి. ఐతే.. మేఘాలు ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో వేడి కూడా ఉంది. అందువల్ల ఎండలో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తెలంగాణ విషయానికొస్తే, ఏప్రిల్ 12 (శనివారం)న మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

 

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుందని అంచనా. ఐతే.. రాత్రి సమయంలో వాతావరణం కొంత చల్లగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఐతే.. 4 రోజులపాటూ.. చెదురు మదురుగా తెలంగాణలో వర్షాలు పడుతూనే ఉంటాయని అధికారులు తెలిపారు. మనం శాటిలైట్ లైవ్ అంచనాల్ని గమనిస్తే.. రెండు రాష్ట్రాల్లో ఉదయం ఎండ వాతావరణం ఉంటుంది. ఉదయం 11 తర్వాత ఉత్తరాంధ్ర నుంచి ఏలూరు వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మధ్యాహ్నం 2 వరకూ కురిసే ఛాన్స్ ఉంది. విశాఖలో భారీ వర్షం కురవవచ్చు. సాయంత్రం నుంచి రాయలసీమలో మేఘాలు పెరుగుతాయి. రాత్రి 8 తర్వాత రాయలసీమలో అక్కడక్కడా జల్లులు పడతాయి. రాత్రి 10 తర్వాత దక్షిణ రాయలసీమలో మోస్తరు వాన పడొచ్చు. తెలంగాణలో చెదురు మదురుగా, అక్కడక్కడా మాత్రమే శనివారం వాన పడుతుంది. అది కూడా చాలా తక్కువే. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 11 కిలోమీటర్లకు పడిపోయింది. ఏపీలో గంటకు 12 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు చూస్తే.. తెలంగాణలో యావరేజ్ 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వాన పడని ప్రాంతాల్లో ఎండ ఎక్కువగానే ఉంటుంది. అలాగే తేమ రెండు రాష్ట్రాల్లో 20 శాతం కంటే తక్కువే ఉంది. రాత్రివేళ తెలంగాణలో 40 శాతం, ఏపీలో 75 శాతం ఉంటుంది. మొత్తంగా IMD అంచనాలు, వాతావరణ అధికారుల అంచనాలు చూస్తే.. రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ శాటిలైట్ లైవ్ అంచనాలు మాత్రం తెలంగాణలో వాన పెద్దగా లేనట్లే అని చూపిస్తోంది. ఏపీలో కూడా ఉత్తరాంధ్ర, దక్షిణ రాయలసీమలో మాత్రమే కొంత వాన పడే ఛాన్స్ కనిపిస్తోంది. అయినా అధికారులు, IMD చెప్పింది మనం లెక్కలోకి తీసుకోవాలి కాబట్టి.. వర్షాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండటం మేలు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయశాంతి భర్తను రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా.. సోషల్ మీడియాలో ప్రమోషన్.!

 

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..

 

పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!

 

నేడు (12/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!

 

వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!

 

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Rains #Telangana #Summer #Temperatures #IMD